calender_icon.png 16 March, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 4 ఫైటింగ్.. 33 మంది మృతి

07-07-2024 01:56:48 AM

చికాగోలో దారుణ హింస

వాషింగ్టన్, జూలై 6: అమెరికాలోని చికాగోలో ‘జూలై ఫోర్త్’ హింసలో ఈ ఏడాది 33 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. చికాగో నగరంలోనే 11 మంది మరణించారు. 55 మంది గాయపడ్డారు. జూలై 4వ తేదీ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భంగా ఏటా ప్రజలు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా దేశ పశ్చమ భాగంలోని ఎడారి ప్రాంతాల్లో ఆయుధాల ముఠాల మధ్య తీవ్ర పోరాటాలు జరుగుతాయి. ఈ ఏడాది అవి మరింత భీకరంగా సాగినట్టు పోలీసులు తెలిపారు. జూలై 3న రెండు చోట్ల జరిగిన తుపాకీ పోరాటాల్లో ఇద్దరు మహిళలు, ఒక 8 ఏండ్ల బాలుడు కూడా చనిపోయారు. ఈ దాడులతో నగరంలో అత్యవసర పరిస్థితి నెలకొన్నదని చికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్ తెలిపారు. గత ఏడాది జూలై ఫోర్త్ కాల్పుల్లో 12 మంది మరణించారు. అంతకుముందు సంవత్సరం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.