17-04-2025 09:59:25 PM
ఉత్తర్వులు జారీచేసిన మల్టీజోన్-1 ఐజిపి
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు - జిల్లా ఎస్పీ
కామారెడ్డి,(విజయక్రాంతి): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు తప్పదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ యం. అంబర్ సింగ్ (HC -1641) పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు, నేరస్తులతో చనువుగా ఉంటూ వారికి అనుకూలంగా వ్యవహారిస్తారని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ దృష్టికి రావడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మల్టీ జోన్ వన్ ఐజిపి జాయిన్ చేసిన ఉత్తర్వుల ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేసినట్లు ఎస్పీ తెలిపారు.