కామారెడ్డి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షిని బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాల గుర్చి వివరించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని దీపాదాస్ మున్షీ తెలిపారు.