03-03-2025 01:46:08 AM
నిజాంసాగర్, మార్చి ౨ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోరుగల్ బేడీల మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, ఓడి బియ్యం సమర్పించారు. సాయంత్రం బోనాలతో ఊరేగింపు నిర్వహించరు.భక్తులు తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు.
ఈ బోనాల ఉత్సవాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ మేరకు స్థానిక నాయకులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరిని చల్లగా సుఖసంతోషాలతో ఉండేలా చూడు తల్లి అని ఎమ్మెల్యే అమ్మవారిని కోరారు.ఈ కార్యక్రమం లోపిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, పట్లోళ్ల దుర్గా రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.