03-03-2025 01:44:27 AM
నిజాంసాగర్, మార్చి ౨ (విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఎన్ ఎస్ వి ఐ మండల అధ్యక్షులు సంతోష్ రాథోడ్ అనారోగ్యానికి గురి కావడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదివారం పరామర్శించారు. కార్యకర్తలకు తాను ఎప్పుడు అండదండగ ఉంటానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఆయనతోపాటు పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, మహమ్మద్ నగర్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సాయి పటేల్, సిద్దు, సవాయి సింగ్ తదితరులు వున్నారు.