పాఠకులకు పలు పుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఆదేశం...
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక శాఖ గ్రంధాలయాన్ని జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి సదరు గ్రంథాలయ సేవలు పాఠకులకు అందుతున్న తీరుపై ఆరా తీశారు. బిచ్కుంద శాఖ గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడ చదువుకుంటున్న అభ్యర్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాలను ఆధునీకరిస్తామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, బిచ్కుంద మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రంథపాటకులు తదితరులు పాల్గొన్నారు.