12-03-2025 02:53:57 PM
పాల్గొన్న భక్తులు
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల పరిధిలోని ఎనబోరా రాచన్న దేవాలయం నుండి కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయానికి జుక్కల్ నియోజకవర్గం లోని పరిసర గ్రామాలు, ప్రాంతాల భక్తులు పాదయాత్రగా వెళ్లారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(Jukkal MLA Thota Lakshmi Kantha Ra) భక్తులతో కలిసి బుధవారం కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొని సోమేశ్వర ఆలయాన్ని రేణుకా చారిలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.