calender_icon.png 21 December, 2024 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయా కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

14-10-2024 02:18:58 PM

రైతులకు ఇబ్బందులు కలిగించద్దని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచించిన ఎమ్మెల్యే

కామారెడ్డి (విజయక్రాంతి): సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం సందర్శించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఇటీవల సోయ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. మద్నూర్ మండల కేంద్రంలోని మాజీ సర్పంచ్ వేదు పటేల్ ఇంటికి వెళ్లి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మద్నూర్ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రైతులకు ధర అందేలా కొనుగోలు కేంద్ర నిర్వాహకులు చూడాలని కోరారు.