25-02-2025 02:05:46 AM
బిచ్కుంద, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్‌లో సోమవారం మెదక్ -నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, డోంగ్లి మండలాల నాయకుల రివ్యూ మీటింగ్‌లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ‘అల్ఫోర్స్‘ వూట్కూరి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని క్యాడర్ ను ఆదేశించారు.పట్టభద్రుల లిస్ట్ తీసుకొని వారి ఇంటికి వెళ్లి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి మరియు ఉద్యోగ నియామకాలు తదితర అంశాలను వారికి వివరించి, ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.