calender_icon.png 21 December, 2024 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలోని కాలిపోర్ణియా యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే

16-09-2024 04:42:07 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలిలో 43వ ఇన్నోవేషన్ ఫోరం జరిగింది. గ్రామీణ అభివృద్ధికి వ్యూహాలు ప్రజాసేవలో విశ్వాస ఆధారిత విలువల ప్రభావం అనే అంశంపై ప్రసంగించడానికి వక్తగా కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జుక్కల్ నియోజకవర్గ స్థితిగతులపై ఒక షార్ట్ వీడియోలు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ అంతర్జాతీయ వేదికపై నియోజకవర్గ పరిస్థితులను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి  పాల్గొన్నారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పత్తి కొద్ది రోజుల్లోనే ఇలాంటి అరుదైన గొప్ప అవకాశం రావడం వల్ల జుక్కల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.