calender_icon.png 30 March, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలి

27-03-2025 05:53:01 PM

జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల డిమాండ్..

జుక్కల్ (విజయక్రాంతి): జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు సాయ గౌడ్ రమేష్ దేశాయ్ రాములు సెట్ శివానంద్ లు కోరారు. గురువారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రిగా స్థానం కల్పించాలని కాంగ్రెస్ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన 15 నెలల్లోనే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు సరైన రీతిలో అమలు చేశారన్నారు. ఇప్పటివరకు వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలో 95 కోట్ల పైచిలుకు నిధులు సిసి రోడ్ల కోసమే మంజూరు చేయించి పనులు జరిగేలా చూస్తున్నారని అన్నారు.

పరిపాలన పట్ల పూర్తి అవగాహన ఉన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇస్తే వెనుకబడిన నియోజకవర్గం జుక్కల్ మరింత అభివృద్ధి జరుగుతుందని వారు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే మంత్రి పదవి ఆశ వాహల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురిలో జుక్కల్ ఎమ్మెల్యే కూడా ఉన్నారన్నారు. ఉన్నత విద్య అభ్యసించి పాలనపై పట్టు ఉన్న నాయకుడిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సామాజిక వర్గంతో కూడా గుర్తింపు ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వానికి కూడా బాగుంటుందని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు.

జుక్కల్ నియోజకవర్గం వర్గం తరఫున తాము తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నామని వారు తెలిపారు. ఇప్పటివరకు జుక్కల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన గత ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి పొందలేకపోయారని, వెనుకబడిన ప్రాంతం అయినందున ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కు మంత్రి పదవి ఇచ్చినట్లయితే జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు జుక్కల్ నియోజకవర్గానికి ఏ ప్రభుత్వం కూడా మంత్రి పదవి కేటాయించ లేదు అని అన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇస్తే జుక్కల్ నియోజకవర్గముకు మరింత న్యాయం జరుగుతుందని వారు ఆశ భావం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వాలు కూడా జుక్కల్ నియోజకవర్గానికి ఒక్కసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. దీంతో వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గం మరింత అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిందని నియోజకవర్గ ప్రజలు కూడా వెనుక పడ్డారని అన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని  కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తోట లక్ష్మీకాంతరావుకు మంత్రివర్గ ములో స్థానం కల్పిస్తే జుక్కల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి జిల్లా అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయ గౌడ్, రమేష్ దేశాయ్, శివానంద్, రాములు సెట్, గంగు నాయక్, రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.