calender_icon.png 19 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

09-04-2025 04:56:38 PM

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన  బుధవారం పార్టీ భవిష్యత్ కార్యాచరణ, బలోపేతం, నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ లక్ష్యంగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల్లో రాష్ట్ర రవాణా శాఖా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో పాటు చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ పాల్గొన్నారు.