హైదరాబాద్: వరద బాధితులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అండగా నిలిచారు. తోట లక్ష్మీ కాంతారావు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక నెల వేతనం విరాళం ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో సర్వస్వం కోల్పోయి అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తన వంతు సాయంగా ఒక నెల వేతనం రూ. 2,75,000 సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అందుకే తన వంతుగా నెల జీతం విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.