సీబీఐ కేసులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఢిల్లీ హైకోర్టు నిర్ణయం
న్యూఢిల్లీ, జూలై 17: మద్యం పాలసీ కుంభకోణంలో సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ మధ్యంతర బెయిల్ పిటిషన్ కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్లు దాఖ లు చేశారు. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌కు ఈడీ కేసులో ట్రయల్ కోర్టు బెయి ల్ ఇచ్చిన తర్వాతే సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిందని తెలిపారు. అప్పటిదాకా ఈ కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించలేదని పేర్కొన్నారు.
2022లో కేసు నమోదైతే 2024లో విచారించడమేంటని ప్రశ్నించా రు. కోర్టులో జడ్జి ఎదుటే అరెస్టు చేశారని, అంత అవసరం ఏమొచ్చిందని అడిగారు. ఇది కచ్చితంగా ఇన్సూరెన్స్ అరెస్టు అని అభిషేక్ వాదించారు. అంతకుముందు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ హైకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. మద్యం పాలసీలో కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మా ర్పులు చేశారని, అందుకు సౌత్ గ్రూప్ వద్ద రూ.100 కోట్లు లంచం తీసుకున్నారని తెలిపింది. రెండు పిటిషన్లపై వాదనలు పూర్త యిన నేపథ్యంలో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై జూలై 29న విచారణ చేపడుతామని హైకోర్టు తెలిపింది.