పౌరసత్వ వివాదంపై ముగిసిన వాదనలు
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ద్వంద్వ పౌరసత్వ పిటిషన్‌పై హై కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు మంగళవారం ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు చెన్నమనేని రమేశ్ ఏ పాస్‌పోర్టు ఆధారంగా విదేశీ ప్రయాణా లు చేస్తున్నారని ప్రశ్నించింది.
జర్మనీ పాస్‌పోర్ట్ మీద ప్రయాణాలు చేశారని పిటిషనర్ ఆది శ్రీని వాస్ తరఫు న్యాయవాది చెప్పారు. ఇప్పటికీ జర్మ నీ పాస్‌పోర్ట్ ఉందని తెలిపారు. దీని పై చెన్నమనేని తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పాస్‌పోర్ట్ ప్రామాణికం కాదని, పౌరసత్వాలకు పాస్‌పోర్టుకు సంబంధం ఉండదని చెప్పారు. అనంతరం భారతదేశ పాస్‌పోర్టు ఉందా అని న్యాయమూర్తి ఆరా తీశారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.