calender_icon.png 31 October, 2024 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీం కోర్టులో జడ్జిలు ఫుల్

19-07-2024 12:05:00 AM

ఇద్దరు కొత్త న్యాయమూర్తుల ప్రమాణం 

34కు చేరిన అత్యున్నత న్యాయస్థానం జడ్జిల సంఖ్య

న్యూ ఢిల్లీ, జూలై 18: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ఇప్పటివరకు సుప్రీం కోర్టులో 32 మంది న్యాయమూర్తులు ఉండగా గురువారం మరో ఇద్దరితో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ ఇద్దరితో కలిపి సుప్రీకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. ఇది కోర్టు పూర్తిస్థాయి సామర్థ్యత. తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్.. మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన మొదటి జడ్జిగా నిలిచారు. మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్ మహదేవ్ కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ యేడాది సెప్టెంబర్ 1వ తేదీన జస్టిస్ హిమా కోహ్లీ రిటైర్ అయ్యేంతవరకు ఈ సంఖ్య ఇలాగనే కొనసాగనుంది. ఆ తర్వాత ఈ యేడాది నవంబర్ 10న సీజేఐ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు.