calender_icon.png 4 January, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల తనిఖీల్లో జడ్జీలు

03-12-2024 12:45:25 AM

నిర్మల్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలను సోమవారం జిల్లాకు చెందిన న్యాయమూర్తులు సందర్శించారు. పట్టణంలోని ప్రయదర్శిని నగర్‌లో ఉన్న గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రతి రోజు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు.

పాఠశాలలో ప్రతి నెల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని సూచించారు. పాఠశాలను సందర్శించిన వా రిలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జిల్లా లీగల్ సెల్ సర్వీస్ ఆథారిటీ కార్యదర్శి రాధిక, మెడికల్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు. వారివెంట పాఠశాల ప్రిన్సిపాల్ అనిల్, సిబ్బంది సుజాత, శ్రీనివాస్ ఉన్నారు.