28-03-2025 12:54:35 AM
నాగర్ కర్నూల్ మార్చి 27 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో నిర్వహిస్తున్న వాత్సల్య అనాధ బాలికల వసతి గృహా నిర్వాహకులపై జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రెటరీ, న్యాయమూర్తి జి.సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వాత్సల్య మందిర్ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉందని మండిపడ్డారు.
దాతల ద్వారా పొందిన సామాగ్రిని ఇతర తినుబండారాలను విద్యార్థులకు బాలికలకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని గుర్తించారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని మరుగుదొడ్లు మూత్రశాలలు కూడా అస్తవ్యస్తంగా ఉండడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు సరిగ్గా ఆహారం అందించడం లేదని సాయంత్రం స్నాక్స్ కూడా అందించడం లేదన్నారు.