calender_icon.png 11 January, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బాలికల సదనాన్ని తనిఖీ చేసిన జడ్జి

10-01-2025 10:53:43 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని మణుగూరు మున్సిపాలిటీలోని శివలింగాపురం ప్రభుత్వ బాలికల సదనాన్ని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కంభంపు సూరి రెడ్డి, న్యాయవాదులు శుక్రవారం తనిఖీ చేశారు. తనికిల్లో భాగంగా సదనం పరిసరాలు గదులను కిచెన్ రూమ్ బాత్రూంలో పరిశీలించారు. బాలికలతో మాట్లాడుతూ.. సదనములో వసతులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని మెజిస్ట్రేట్ సూరి రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సదనం నిర్వాహకురాలు జయలక్ష్మికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ న్యాయవాది సర్వేశ్వరరావు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేదరమెట్ల శ్రీనివాస్, న్యాయవాదులు చిర్రా రవికుమార్, వీరంకి పద్మావతి, రాయి నాగేశ్వరరావు, అశోక్, కోర్టు సిబ్బంది శ్రీకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.