calender_icon.png 26 March, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టళ్లను తనిఖీ చేసిన న్యాయమూర్తి శివ నాయక్

25-03-2025 07:48:44 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోని తాళ్ల గొమ్మూరు గ్రామంలో గల జిఎస్ఈఎల్ సిటిఎఫ్టి హాస్టల్, బ్రోక్ చిల్డ్రన్స్ హాస్టల్ ను భద్రాచలం ప్రధమ శ్రేణి న్యాయమూర్తి, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ శివ నాయక్ మంగళవారం తనిఖీ చేశారు. హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై న్యాయమూర్తి ఆరా తీశారు. అనంతరం భద్రాచలంలోని పోస్ట్ మెట్రిక్ డిగ్రీ గిరిజన బాలుర హాస్టల్ ను తనిఖీ చేశారు. మెనూ సరిగా అమలు చేయకపోవడంతో వార్డెన్, సిబ్బందికి పలు సూచనలు చేశారు.