calender_icon.png 16 January, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయింపులపై న్యాయపోరు

06-08-2024 02:02:13 AM

  1. త్వరలో సుప్రీం కోర్టులో కేసువేస్తాం
  2. న్యాయ కోవిదుల సలహాలు పాటిస్తాం 
  3. ఢిల్లీ పర్యటనలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి సోమవారం ఆయన ఢిల్లీ వెళ్లారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయకోవిదులతో కలిసి వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు.

చర్చల అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా ఇంకా నాన్చలేరన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశామని, దీనిపై హైకోర్టు నుంచి సరైన స్పందన రాకపోతే తాము సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

స్పీకర్ ఇక ఎంతోకాలం అనర్హత వేటు అంశాన్ని దాటవేయలేరని తేల్చిచెప్పారు. న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణుల సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా క్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఒకవైపు జాతీయస్థాయిలో పార్టీ ఫిరాయింపులపై  సుద్దపూస ముచ్చట్లు చెబుతూ, రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం విఫలం.. 

ప్రభుత్వం బడుల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫ లమవుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఓ ప్రకటనలో ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనం లో పిల్లలకు కారంలేని పప్పు వండటం, పిల్ల లు తినేందుకు ఇష్టపడకపోవడంతో వారికి గొడ్డుకారం, నూనె పోసి భోజనం పెట్టడంపై మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు మంచి భోజనం పెట్టకపోగా, కేసీఆర్ ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా కొనసాగించిన బ్రేక్ పాస్ట్ పథకాన్ని రద్దు చేయడమేంటని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పిల్లలకు మంచి ఆహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు.