calender_icon.png 21 September, 2024 | 5:16 PM

సీఎంకు జూనియర్‌ ఎన్టీఆర్ ధన్యవాదాలు

21-09-2024 03:08:20 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ ధన్యవాదాలు తెలిపారు. దేవర సినిమా విడుదల కోసం కొత్త జీవోను ఆమోదించినందుకు, తెలుగు సినిమాకి నిరంతరం మద్దతు తెలుపుతున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి కూడా నా కృతజ్ఞతలు అంటూ జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ ట్వీట్‌ చేశారు.