calender_icon.png 14 April, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసారి కల్యాణ్ అన్న కాలర్ నేనెగరేస్తున్నా

13-04-2025 12:25:52 AM

 -‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్  

నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయం తి’. ఈ సినిమాలో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అశోక క్రియే షన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానున్న సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ఈ వేదికపై నేను, అన్న నిలుచున్న ప్పుడు నాన్న చాలా సార్లు  మాట్లాడారు.

ఈరోజు నాన్న లేని లోటు తీరినట్లయింది విజయశాంతి మాట్లాడుతుంటే. చాలామంది గొప్ప సినిమాలు అద్భుతంగా అలరించారు. కానీ విజయశాంతి సాధించిన గొప్పతనం ఏ మహిళా సాధించలేదు. నాకు తెలిసి భారతదేశంలో ఏ నటీ విజయశాంతిలాంటి పాత్రలు చేయలేదు. దేశ చలనచిత్ర పటంలో హీరోలకు సమానంగా నిలుచున్న ఏకైక మహిళ విజయశాంతి.  ఈ సిని మాకు అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు.   

ప్రతిసారి కాలర్ ఎగరేయమని నేను చెప్తుం టా. ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ని నేను ఎగరేస్తున్నా. కళ్ల నుంచి నీళ్లు ఆపుకోవడం నా వల్ల కాలేదు. విజయశాంతిని అమ్మ అని నమ్మేసి అన్న ఈ సినిమా చేశారు. కాబట్టే అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు” అన్నా రు. కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. ‘కొన్ని సినిమాలే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మనసు ను హత్తుకునే ఉంటాయి. అలాంటిదే ఈ మా సినిమా’ అని చెప్పారు.

విజయశాంతి మాట్లాడుతూ.. “ప్రతి ఒక్క తల్లికి ఈ సినిమాను అంకితం చేయదల్చుకున్నాం. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ను చూస్తుంటే రామలక్ష్మ ణుల్లా ఉన్నారు’ అన్నారు. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ.. ‘నందమూరి లెగిసిని కంటిన్యూ చేయడం ఒక బాధ్యత. అలాంటి బాధ్యతని నిర్వర్తిస్తున్న ఇద్దరు హీరోలు మా ముందు ఉన్నారు. ప్రొడ్యూసర్స్ ఎక్కడ వెనకడుగు వేయకుండా కల్యాణ్ ఈ సినిమాను తీశారు’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ సయీ మంజ్రేకర్, ప్రొడ్యూసర్ అశోక్‌వర్ధన్ ముప్పా, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.