calender_icon.png 1 April, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ, విదేశాలలో జేపీఎన్సీఈ విద్యార్థులు

30-03-2025 09:21:22 AM

జేఎన్టీయూలో గోల్డ్ మెడల్  సాధించిన జేపీఎన్సీఈ పూర్వపు విద్యార్థిని స్వాతి

జేపీఎన్సీఈ లో చదివి చెల్లించిన ఫీజును విద్యార్థినికి తిరిగి ఇచ్చిన కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ 

పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న జేపీఎన్సీఈ కళాశాల 

విజయ్ క్రాంతి దినపత్రిక తో సంభాషించిన జెపిఎన్సిఈ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్

మహబూబ్​నగర్, (విజయక్రాంతి): పేద జిల్లా.. కరువు జిల్లా... అంటూ పేరుగాంచిన పాలమూరు జిల్లాకు మణిహారంగా జెపిఎన్సిఈ కళాశాల నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంజనీరింగ్ విద్యకు ఎక్కడో ప్రధాన పట్టణ కేంద్రాల కు వెళ్లి లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టలేక దూరమవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు జేపీఎన్ సీఈ కళాశాల ఇంజనీరింగ్ విద్య(JPNCE College Engineering Education)ను నిరుపేద విద్యార్థులకు దగ్గర చేసింది. ఇంజనీరింగ్ విద్య చదివే విద్యార్థులకు ఈ కళాశాల ఎంతో మేలు చేకూర్చుతుంది. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని ధర్మపురంలో ఈ కళాశాల కొలువుతీరిన విషయం అందరికీ విధితమే. ఈ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలలో ప్రత్యేక హోదాలలో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ కేస్ రవికుమార్ విజయ క్రాంతి దినపత్రికతో ప్రత్యేకంగా సంభాషించారు. 

పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యం..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ కళాశాల అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతో మహబూబ్ నగర్(Mahabubnagar) ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఎంతో శ్రమ ఉంది. హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాలలో కళాశాల ఏర్పాటు చేస్తే.. ప్రస్తుతం ఉన్న ఫీజుల కంటే అత్యధికంగా వసూలు చేసే అవకాశం ఉండేది. కాగా పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా ఎంతోమంది తల్లిదండ్రులు రాత్రి పగలు శ్రమించి తమ బిడ్డలను ఉన్నత విద్యలు అందించాలని సంకల్పానికి తాము ప్రాణం పోస్తామని ఆశతో మహబూబ్ నగర్ లో జేపీఎన్సీఈ కళాశాల(JPNCE College)లో ఆవిష్కృతం చేయడం జరిగింది. దశాబ్దాల కాలం క్రితమే తమలో ఈ ఆలోచన పుట్టింది. ఆస్తులు అంతస్తులు సంపాదించడమే కాదు మనశ్శాంతి... ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు మంచి ఉన్నత విద్య అందిస్తూ దేశ విదేశాలలో పాలమూరు బిడ్డల భవితవ్యం ఉండేలా జేపీఎన్సీఈ కళాశాల ఆవిష్కృతం అయినప్పటి నుంచి కంకణ బద్దలమై పనిచేస్తున్నాం. 

జేఎన్టీయూలో గోల్డ్ మెడల్  సాధించిన జేపీఎన్సీఈ పూర్వపు విద్యార్థిని స్వాతి

జేపీఎన్సీఈ కళాశాలలో విద్యనభ్యసించి జేఎన్టీయూ ఎంబీఏ చదివి గోల్డ్ మెడల్ సాధించిన జడ్చర్ల పట్టణానికి చెందిన స్వాతి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఆ విద్యార్థి తమ కళాశాలలో చెల్లించిన ఫీజును తిరిగి ఇవ్వడం జరిగింది. గోల్డ్ మెడల్ స్వీకరించిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి రూ. 1 లక్ష ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గోల్డ్ మెడల్స్(Gold Medal) సాధించిన స్వాతి తండ్రి రవీందర్ కు ముగ్గురు ఆడపిల్లలు. స్వాతి రెండవ కూతురు. స్వాతి తండ్రి రవీందర్ మహబూబ్ నగర్ పట్టణం నుంచి జడ్చర్ల పట్టణం తదితర ప్రాంతాలకు చిన్నపాటి ట్రాలీ వాహనాన్ని నడుపుతూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇతను ఒక్కరే కాదు ఇలా ఎంతోమంది ఎంతో తల్లిదండ్రులు శ్రమించి తమ బిడ్డలకు ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నారు.

బిడ్డల ఎదుగుదల కోసం రాత్రి పగలు భేదం లేకుండా శ్రమిస్తున్న తల్లిదండ్రుల కలలను నిజం చేసేందుకు జెపిఎన్సిఈ కళాశాల ఒక అడుగు ముందు వరసలో ఉంటూ భరోసా కల్పిస్తుంది. బాగా చదివే విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వారు ఎక్కడ ఉన్నా వారు యోగక్షేమలను తెలుసుకుంటూ విద్యార్థుల ఎదుగుదలకు అండగా ఉంటూ ముందుకు సాగుతున్నాం. మా కళాశాలలో చదివిన విద్యార్థులకు వేలాది మందికి ప్లేస్మెంట్ లు రావడం జరిగింది. దేశ విదేశాలలో కూడా మన కళాశాలలో చదివి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి. నేను చేరుకోవాలి అనుకునే లక్ష్యం ను  పాలమూరు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఇంజనీరింగ్ విద్యతో ఎప్పుడో చేరుకోవడం జరిగింది.  కష్టపడి చదివితే ఏ కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు  అధిరోహిస్తారని చెప్పేందుకు జేపీఎంసీ కళాశాల పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఆదర్శంగా ఉన్నారు.