31 మందితో ఏర్పాటుచేసిన స్పీకర్
ఒవైసీ, డీకే అరుణ, టీడీపీ ఎంపీకి చోటు
న్యూఢిల్లీ, ఆగస్టు 9: వివాదాస్పదంగా మారిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేశారు. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలతో మొత్తం 31 మందిని సభ్యులుగా చేర్చారు. ఈ కమిటీ బిల్లును లోతుగా అధ్యయనం చేయటంతోపాటు దానితో ముడిపడి ఉన్న సంస్థలు, వ్యక్తులు, మేధావుల అభిప్రాయాలు సేకరించి వచ్చే పార్లమెంటు సమావేశాల నాటికి పలు మార్పులు చేర్పులతో నివేదిక ఇస్తుంది. అనంతరం ఆ బిల్లును పార్లమెంటులో ఓటింగ్‌కు పెడుతారు. కీలకంగా మారిన ఈ కమిటీలో హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు చోటు లభించింది. ఎన్డీయే మిత్రపక్షం టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయకు కమిటీలో చోటు కల్పించారు.