calender_icon.png 1 January, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ సభ్యుల భేటీ

07-09-2024 12:35:11 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భేటీ అయింది. జేపీసీలో సభ్యురాలైన మహబూబ్‌నగర్ బేజేపీ ఎంపీ డీకే అరుణ ఈ భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో చోటు చేసుకున్న వక్ఫ్ భూముల వివాదాలను డీకే అరుణ కమిటీ ముందుంచారు. జేపీసీకి ఇప్పటికే వక్ఫ్ భూముల వివాదాలకు సంబంధించిన వినతి పత్రాన్ని అందచేశారు. వక్ఫ్ భూముల పేరిట సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను జేపీసీ దృష్టికి తీసుకుపోయారు. మరోవైపు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై తెలంగాణ వక్ఫ్ బోర్డు సభ్యులు జేపీసీకి తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను అందించారని ఎంపీ డీకే అరుణ తెలిపారు.