calender_icon.png 3 October, 2024 | 2:00 AM

ఈ నెలాఖరులోగా తెలంగాణకు జేపీసీ

10-09-2024 04:50:48 AM

  1. నిరుపేదల కోసమే వక్ఫ్ బోర్డులో సవరణలు 
  2. రాష్ట్రానికి కేంద్రం 3,600 కోట్లపరిహారం 
  3. ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ఈ నెలాఖరులోగా జేపీసీ తెలంగాణ కు వస్తోందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. వక్ఫ్ బోర్డులో సవరణలపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని కేంద్రం ఏర్పాటు చేసిందన్నా రు. ఇదే అదునుగా ప్రతిపక్ష నేతలు ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుని విడ్డూరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డా రు. సోమవారం పాలమూరులో ఆమె మాట్లాడారు. నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకు వక్ఫ్ బోర్డులో సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

బోర్డు లక్ష్యాన్ని నెరవేర్చేందుకు జేపీసీ ప్రయత్నిస్తోందని తెలిపారు. తమ సమస్యలను, సలహాలను, సూచనలను కమిటీ ముందు ఉంచాలని ప్రజలకు సూచించారు. సేత్వార్ నుంచి తాము పొజిషన్‌లో ఉన్నామని, ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందడం లేద ని ముస్లింలే చెబుతున్నారని వివరించారు. ఇది మతపరమైన అంశం కాదని, వక్ఫ్ భూ ములతో వచ్చిన లాభాన్ని ఏ నిరుపేదను అం దుకున్నాడో చెప్పాలన్నారు.

 రూ. 3,600 కోట్ల  పరిహారం..

 వరదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి కేంద్రం రూ.3,600 కోట్ల  పరిహారం ఇచ్చేందుకు హామీ ఇచ్చిందని డీకే అరుణ తెలిపారు. జిల్లాలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు రైతుబంధు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ రెండు నెలల్లో రాష్ట్రంలో 12 మంది అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగాయని, 21 మంది కూలీలు, 26 మంది వివా హిత మహిళలపై, ఆగస్టు 4 ఇద్దరి జర్నలిస్టులపైనా దాడులు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎలాంటి ఆందోళనలు జరిగినా స్పందించే నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలో ఏమి జరిగినా ఎందుకు స్పందించడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉన్నారు.