08-02-2025 07:17:24 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అనంతరం ప్రధాని మోదీ పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేశారు. పలువురు నేతలు మోదీని గజమాలలతో సత్కరించారు.
ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ... దేశ రాజధాని ఢిల్లీలో చరిత్రాత్మక విజయం సాధించామని, ఢిల్లీలో విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. మోదీ నేతృత్వంలో పార్టీ వరుస విజయాలు సాధిస్తోందని కొనియాడారు. ఢిల్లీ ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచారని, ఈ విజయం కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని నడ్డా పేర్కొన్నారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లోనూ ఢిల్లీ ప్రజలు తామ వెంటనే ఉన్నారని, 7 లోక్ సభ సీట్లలోనూ బీజేపీ గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజల మనస్సుల్లో మోదీ కొలువై ఉన్నారని నడ్డా అన్నారు. పేదలు, బలహీనవర్గాల జీవితాల్లో మార్పు తేవడమే మోదీ లక్ష్యమని చెప్పారు.