సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
పెబ్బేరు, పిబ్రవరి 2: పెబ్బేరు మండల అభివద్ధి కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 1.30లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేసిన సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మండలం కొత్త సుగూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్దిల చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు.
గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజి నిర్మాణాలు చేపట్టెందుకు నిధుల మంజురు కోసం కషి చేసిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, ఎంపీ మల్లు రవికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాసులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, గంధం రాజశేఖర్, రాములు, కురుమూర్తి, టీఎమ్మార్ జిల్లా జనరల్ సెక్రటరీ శివకుమార్, డైరెక్టర్లు రామన్ గౌడ్, మోతే రాములు, శివసాయి, వెంకటేష్, యూత్ జనరల్ సెక్రటరీ సూగూర్ శివ, మండల యూత్ అధ్యక్షులు రాజేష్, గోవిం ద్, శివ, వినయ్, నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.