calender_icon.png 25 September, 2024 | 9:56 AM

ఎన్టీఆర్‌తో జర్నీ నాకెప్పుడూ స్పెషలే

25-09-2024 03:14:18 AM

ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆరట్స్, యువ సుధ ఆరట్స్ పతాకాలపై  మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ సినిమా గురించి మీడియాకు చెప్పిన విశేషాలివీ..

* ‘దేవర’ మూవీ కథ అంతా పిక్షనల్. ఎక్కడా నిజ ఘటనలను ఆధారంగా చేసుకోలేదు. మనిషికి మితిమీరిన ధైర్యం కరెక్ట్ కాదు. అది మూర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండా మనలో ఉండే భయాన్ని గౌరవించాలని చెప్పటమే ‘దేవర’ కథ. 

* ఎన్టీఆర్‌గారితో జర్నీ ఎప్పుడూ నాకు స్పెషలే. ఏ విషయమైనా ఆయనతో డిస్కస్ చేసినప్పుడు ఓపెన్‌గా మనసులో ఉన్న భావాన్ని చెబుతారు. ‘దేవర’ లైన్ చెప్పినప్పుడు ఆయన స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని నిర్ణయించు కున్నాం. సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికే 6 నెలలు సమయం తీసుకున్నాం. సముద్రాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి.. దానిపై ఎలా షూట్ చేయాలనే అంశాలపై స్టడీ చేశాం. ఇలా షూటింగ్ ఎవరూ చేయకపోవటం వల్ల సలహాలిచ్చేవాళ్లు లేరు. అందుకే సమయం పట్టింది. ‘ఆచార్య’ రిలీజైన 20 రోజుల్లోనే దేవర సినిమా మోషన్ పోస్టర్ పనిలో పడ్డాను.

* నెరేషన్ 4 గంటలుంది.. పేపర్ మీద పెట్టినప్పుడు అది 6-7 గంటలు వస్తుంది. సెకండ్ షెడ్యూల్ అప్పుడే మూడు గంటల్లో ఈ కథను చెప్పలేమని అర్థమైంది. రెండు పార్టులు వద్దనుకుని రివర్స్‌లో వెళ్లాం. కానీ కుదరదని తెలిసిపోయింది. దాంతో రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎన్టీఆర్ పాత్ర చుట్టూ తిరిగే కథ. ఆయనే హీరో.. కథ రాసుకునేటప్పుడే రెండు పాత్రలకు ఎన్టీఆర్‌గారిని అనుకున్నాను. దేవర కొడుకు వర.. పాత్ర ఆయన్ని మించేలా ఉంటుంది. 

* మనిషిలో ఉండాల్సిన భయాన్ని నేను జాన్వీలో చూశాను. వారం, పది రోజుల ముందు నుంచే సీన్ పేపర్ కావాలని నన్ను అడిగి తీసుకుని ప్రాక్టీస్ చేసుకుని సెట్స్‌కు వచ్చేది. సైఫ్ అలీఖాన్‌గారిలో నార్త్ లుక్ ఉంటుందేమోనని భయపడ్డాను. సైఫ్గారు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే నేను లుక్ టెస్ట్ స్కెచ్ వేసి పంపాను. ఆయనే నమ్మలేకపోయారు. ఓ గంట ముందు లొకేషన్‌కు వచ్చి ప్రిపేర్ అయ్యేవారు. అనిరుద్ మ్యూజిక్ పట్ల నేను హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నాను. త్వరలోనే ఆయుధపూజ సాంగ్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం.