calender_icon.png 29 September, 2024 | 7:54 AM

సునీతను తీసుకొచ్చేందుకు పయనం

29-09-2024 01:38:29 AM

న్యూయార్క్, సెప్టెంబర్ 28: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌ను తిరిగి భూమికి తీసుకొచ్చేం దుకు మరో స్టార్‌లైనర్ నౌక శనివా రం బయలుదేరి వెళ్లింది. ఇందులో అమెరికా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ వెళ్లారు. సునీత, బుచ్‌ను తీసుకొచ్చేందుకు ఈ వ్యోమనౌకలో మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్పేస్‌ఎక్స్ రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను పంపారు.