calender_icon.png 29 November, 2024 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల స్థలాలు

27-08-2024 12:42:46 AM

రాష్ట్ర పౌర సంబంధాలు, సమాచారశాఖ మంత్రి పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన జర్న లిస్టులందరికీ త్వరలో ఇండ్ల స్థలాలు పంపి ణీ చేస్తామని రాష్ట్ర పౌర సంబంధాలు, స మాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా పాల్వం చలో సోమవారం ఆయన ప్రెస్‌క్లబ్ నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలకు తమ ప్రభుత్వం పరిష్కారం చూపుతుందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారని కొనియాడారు. గత ప్రభుత్వం కేవలం మీడియా సమావేశాల్లో మాత్రమే జర్నలిస్టుల గురిం చి మాట్లాడేదని, కానీ వారి సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సొసైటీలో సభ్యులుగా ఉన్న జర్నలిస్టులకు ఈనెలాఖరులోపు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎ మ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్‌రావు, కేటీసీఎస్ ఎస్‌ఈలు, ప్రెస్‌క్లబ్ నిర్మాణ దాత శ్యామల గోపాల్ ఎడ్యుకే షన్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేష్‌రెడ్డి, జర్నలిస్టులు పాల్గొన్నారు.

గీత కార్మికులకు కాటమయ్య కిట్లు 

ఖమ్మం, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఖ మ్మం జిల్లా కూసుమంచిలోని మంత్రి క్యాం ప్ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర పౌ ర సంబంధాలు, సమాచారశాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి గీత కార్మికులకు కాట మయ్య కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌రావు, ఖమ్మం ఆర్డీవో జి.గణేశ్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి  జ్యోతి పాల్గొన్నారు.