calender_icon.png 24 January, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష డప్పులు, వెయ్యి గొంతుల నిరసనకు జర్నలిస్టుల మద్దతు

24-01-2025 12:00:00 AM

 భాగస్వాములు కావాలని యూసుఫ్ బాబు పిలుపు

సిద్దిపేట, జనవరి 23 (విజయక్రాంతి) : సామాజిక డిమాండ్ ను అమలు చేయాలని ఏంఆర్ పీఎస్ ఫిబ్రవరి 7న చేపట్టిన లక్ష డప్పులు - వెయ్యి గొంతుల నిరసనలో జర్నలిస్టులు పాల్గొని  విజయవంతం చేయాలని చిన్నపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మైనార్టీ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా పోరు దినపత్రిక ఎడిటర్ యూసుఫ్ బాబు పిలుపునిచ్చారు.

వర్గీకరణ  అమలు కొరకు  జరుగుతున్న ఈ సమరంలో లక్షల  డప్పులతో  జర్నలిస్టుల దండు కదలిరావాలని కోరారు. బుధవారం రాత్రి సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన మాదిగ జర్నలిస్ట్ ఫోరం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదిగలతో కలిసి డప్పు కొట్టి  మరీ చెప్తున్నా వర్గీకరణ అమలుకై  జరిగే  ప్రజాపోరుకు జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

మంద కృష్ణ మాదిగ చేసిన ప్రతి పోరాటంలో కులమతాలకు అతీతంగా లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. చిన్నపత్రికల సంఘం రాష్ట్ర ఉపఅధ్యక్షులు, అవని దినపత్రిక ఎడిటర్ కూతురు రాజిరెడ్డి మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి జర్నలిస్టుల మద్దతు ఉంటుందన్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే నిరసనలో జర్నలిస్టులు సైతం ప్రధాన భూమికి పోషిస్తారని ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు చాకిరేవు దినపత్రిక ఎడిటర్ వెంకటయ్య, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్, జలది దినపత్రిక ఎడిటర్ సత్యనారాయణ, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కలకొండ రామకృష్ణ, ఏంజెఎఫ్ జాతీయ అధ్యక్షులు మాతంగి దాస్, ప్రముఖ సోషల్ మీడియా అనాలసిస్ ప్రతినిధి ప్రశాంత్ పటేల్, ఎమ్‌ఎస్పి జిల్లా అధ్యక్షులు పేరిక పరిశ రాములు , జర్నలిస్టులు బౌగొని శ్రీకాంత్, ఎర్ర  నర్సయ్య, ధబెట చందు, మంద జనార్దన్, ఎమ్ ఆర్పి ఎస్ జిల్లా అధికార ప్రతినిధి  చుంచూ రమేష్ తదితరులు పాల్గొని  తమ పూర్తి  మద్దతు ఉంటుందని తెలిపారు.