calender_icon.png 10 March, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయులు నాణ్యమైన వార్తలను సమాజానికి అందించాలి

09-03-2025 12:33:50 PM

మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సమావేశంలో అధ్యక్షులు మోతుకూరి శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): పాత్రికేయులు నాణ్యమైన వార్తలను సమాజానికి అందించాలని మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోతుకూరి శ్రీనివాస్(Manthani Division Media Press Club President Motukuri Srinivas) తెలిపారు. మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సమావేశంలో అధ్యక్షులు మోత్కూరి శ్రీనివాస్  ప్రెస్ క్లబ్ విధి విధానాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ రాజకీయాలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమస్యలను వార్తలుగా మలిచి ప్రజల కోణం నుంచి అందిస్తుందన్నారు. అలాగే పాత్రికేయుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తుందని,  పాత్రికేయులు విధి నిర్వహణలో ప్రమాదాలకు గురైతే వారికి, వారి కుటుంబాలకు ప్రెస్ క్లబ్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పాత్రికేయ మిత్రులు నాణ్యమైన ఆలోచనత్మకమైన విశ్లేషణాత్మకమైన పరిశోధనాత్మకమైన వార్తలు ప్రచురించి ప్రజలు,  మేధావుల అభిమానాన్ని చూరగొనాలని సూచించారు. పాత్రికేయ వృత్తిని గౌరవ ప్రధమైనదని, దానికి భంగం కలగకుండా ప్రతి ఒక్కరు పని చేయాలని,  పాత్రికేయులకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన హక్కులను సాధించుకొనుటకు సమిష్టిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డివిజన్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ కమిటీతో పాటు మంథని, కమాన్ పూర్, ముత్తారం, రామగిరి మండలాల పాత్రికేయులు, కార్యవర్గ కమిటీ ఉపాధ్యక్షులు జబ్బర్ ఖాన్, బొల్లవరం విజయనంద రావు, ప్రధాన కార్యదర్శి కొడారి మల్లేష్ యాదవ్, సహాయ కార్యదర్శి లు మాదరబోయిన కిషన్, మాటేటి కుమార్, కోశాధికారి గడిపల్లి అజయ్ కార్యవర్గ సభ్యులు  సమావేశంలో పాల్గొన్నారు.