calender_icon.png 25 February, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి

25-02-2025 01:10:35 AM

కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వినతి

జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 24 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పని చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికి ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్యాతం సతీష్, సామంతుల శ్యామ్ ఐజేయు రాష్ర్ట హెల్త్ కమిటీ మెంబర్ సామల శ్రీనివాస్, రాష్ర్ట ఈసీ మెంబర్ విజయ్, ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడు తడుక సుధాకర్, టెంజు జిల్లా అధ్యక్షుడు కొంకుల సాంబయ్య, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ సమ్మయ్య గౌడ్, జర్నలిస్టులు సాంబయ్య, రమేష్ పాల్గొన్నారు.