30-04-2025 05:12:56 PM
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్..
హనుమకొండ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని చేపడుతున్న మహా ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్(Corporator Gurumurthy Sivakumar) పాల్గొన్నారు. తదనంతరం మాట్లాడుతూ... జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ఇచ్చి ప్రభుత్వం ఇంతటి నిర్లక్ష్య ధోరణి మానుకోవాలని కోరారు.
హసన్ పర్తిలో 18 మంది జర్నలిస్టులకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అర్హులైన వరంగల్ లో ఉన్న జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఏమి అమలు పరచకుండా పబ్బం గడుపుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వన్నాల శ్రీరాములు, రాష్ట్ర, జిల్లా, మండల పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, విలేకరులు తదితరులు పాల్గొన్నారు.