calender_icon.png 28 January, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన

27-01-2025 12:45:51 PM

డిప్యూటీ తాహసిల్దార్ కు వినతి..

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యలను పరిష్కరించాలంటూ టీయుడబ్ల్యూజే(ఐజేయూ) హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి, ర్యాలీ నిర్వహించారు. తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ తాహసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో -కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణలు మాట్లాడుతూ... గత 20 సంవత్సరాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తూ గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పొందినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని అనుకున్నప్పటికీ తమకు నిరాశే ఎదురైందన్నారు. ప్రజా పాలనాన్ని అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు.

నివేషణ స్థలాలు విషయంలో ఇప్పటికే ఇద్దరు జర్నలిస్టులు మనో వేదనతో చనిపోయారని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కేటాయించిన స్థలాల్లోనే ఇందిరమ్మ గృహ పథకం కింద పూర్తిస్థాయిలో ఇళ్ళు కట్టించాలని విజ్ఞప్తి చేశారు. మా ఇళ్ల సమస్యల ను పరిష్కరించే వరకు దశలవారీగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు, అధికారులు తమ గృహాల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నంబి భరణి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్, జిల్లా నాయకులు చిలుకమారి సత్యరాజ్, వేల్పుల సునీల్, బొడ్డు శ్రీనివాస్ తో పాటు సీనియర్ జర్నలిస్టులు మామిడి రవీందర్, తిరునగరి ఆంజనేయస్వామి, అల్లి నరేందర్, సురు కంటి తిరుపతిరెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.