11-12-2024 03:00:15 PM
పటాన్ చెరు,(విజయక్రాంతి): మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని పటాన్ చెరు నియోజకవర్గ జర్నలిస్టుల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. దాడిని నిరసిస్తూ బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి పటాన్ చెరు జాతీయ రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద బైటాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. అనంతరం జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లి పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి, అశ్వక్, సుదర్శన్ రెడ్డి, బసవేశ్వర్, కాశీపతి, నరసింహ, రఘురామిరెడ్డి, పవన్, నారాయణ, సురేందర్, బాలు, అజయ్, సత్యం, విజయ్, రాజు, వివేక్ తదితరులు పాల్గొన్నారు.