25-02-2025 01:13:51 AM
- ఏండ్ల తరబడి ఇండ్ల స్థలాల కోసం పోరాటం
- కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా..
-కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి) : జర్నలిస్టులందరికీ సముచిత స్థానం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని.. ఏండ్ల తరబడి ఇండ్ల కోసం ఇంటి స్థలాల కోసం నిరీక్షిస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరికాదని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు డాక్టర్ బండి విజయకుమార్ మాట్లాడుతూ పనిచేస్తున్న జర్నలిస్టులకు అరులుగా గుర్తించి వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
పట్టణం మౌలాలి గుట్ట వద్ద నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అరత కలిగిన జర్నలిస్టులకు గత ప్రభుత్వం కేటాయించిందని వారందరికీ యధావిధిగా ఇండ్లను వెంటనే అప్పగించాలని కోరారు. ఎస్వీఎస్ గుట్ట వద్ద జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్లను యధావిధిగా కొనసాగిస్తూ వారికి పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో సీనియర్ జర్నలిస్టులు కొందరికి అన్యాయం జరిగిందని, సరిచేసి అరత కలిగిన ప్రతి జర్నలిస్టుకు గూడు కల్పించే విధంగా జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను తక్షణం ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పెన్షన్ స్కీం, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు, చిన్న మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడంతో పాటు అవసరమైన అడ్వర్టుజ్మైంట్ లు కూడా అందించాలని కోరారు. తమ డిమాండ్లను జిల్లా కలెక్టర్కు వినతి పత్రంలో అందజేశారు. జర్నలిస్టులో అధిక సంఖ్యలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.