calender_icon.png 25 February, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

25-02-2025 12:59:46 AM

సూర్యాపేట టౌన్ ఫిబ్రవరి 24: ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కారించాలని టిడబ్ల్యూజేఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి బుక్క రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్వాయి జానయ్య, నాయిని శ్రీనివాస్ రావు లు కోరారు. సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రాష్ట్రం ఏర్పాడిన అనంతరం ఇక్కడ పనిచేస్తున్న విలేకరుల జీవితాల్లో మార్పులు వస్తాయని అనుకున్నామని, బిఆర్‌ఎస్ పార్టీ తమ సమస్యలను తీర్చలేదని, ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి జర్నలిస్ట్ కు న్యాయం చేసే విధంగా చూడాలన్నారు.