25-02-2025 12:00:00 AM
రంగారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి ):జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రా న్ని అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మిద్దెల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఎం.సైదులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని...కొత్త ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు అందజేయాలని కోరారు. రాష్ట్రంలో జర్నలి స్టులపై దాడులను అరికట్టాలని ఇందు కోసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలన్నారు.
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయడం తో పాటు గా ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగుల మాదిరిగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో అమలుకు చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్ నరేష్ ఆంజనేయులు నరసింహ రెడ్డి భరత్ మధు సురేష్ వెంకట్ తదితరులు ఉన్నారు.