calender_icon.png 8 February, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూపాలపల్లి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలి

08-02-2025 03:18:41 PM

జిల్లా కలెక్టర్ కు జర్నలిస్ట్ ల వినతి పత్రం

చిట్యాల,(విజయక్రాంతి): మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టును బెదిరింపుల గురిచేస్తున్న భూపాలపల్లి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma)కు వినతి పత్రం అందజేశారు. భూపాలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కులం, నివాసం, ఆదాయం సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం కావడం, మీసేవ కేంద్రాల నిర్వహన సరిగా లేకపోవడంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఓ జర్నలిస్ట్ కథనం ప్రచురించగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అధికారి కథనం రాసిన జర్నలిస్టును కార్యాలయం కు పిలిచి బెదిరింపులకు గురిచేయడం జరిగిందని కలెక్టర్ కు వివరించారు. జర్నలిస్ట్ ల వినతి పట్ల కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(Telangana State Journalists Union) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ  పావుశెట్టి శ్రీనివాస్(NUJI State Organizing Secretary Pavushetty Srinivas), జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, టియుడబ్ల్యూజే టెంజు అధ్యక్షులు కొంకుల సాంబయ్య,బండారి రాజు, పల్నాటి రాజు, కనుకుల దేవేందర్, కార్కూరి సతీష్, సంగెమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.