calender_icon.png 10 March, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీలో జర్నలిస్ట్ దారుణ హత్య

10-03-2025 12:00:00 AM

లక్నో, మార్చి 9: ఉత్తరప్రదేశ్‌లో రాఘవేంద్ర వాజ్‌పేయి అనే జర్నలిస్ట్ శనివారం దారుణ హత్యకు గురయ్యారు. సీతాపూర్‌లోని ఢిల్లీ జాతీయ రాహదారిపై కొందరు దుండగులు ఆయన బైకును ఢీ కొట్టారు. అనంతరం రాఘవేంద్రపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

హత్య వెనకగల ఉద్దేశాన్ని పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేదు. అలాగే ఘటనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కేసు నమోదుకు ముందు మృతుడి కుటుంబ సభ్యల నుంచి అధికారిక ఫిర్యాదు కోసం వేచి చూస్తున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. హిందీ డైలీ అనే పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న రాఘవేంద్ర.. ఆర్టీఐ కార్యకర్తగాను పని చేస్తున్నారు.