calender_icon.png 26 December, 2024 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటీకరణను ప్రోత్సహించేందుకే జాయింట్ వెంచర్

06-10-2024 12:42:36 AM

టీజీపీఈజేఏసీ నాయకులు

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ప్రైవేటీకరణను ప్రోత్స హించేందుకే సింగరేణితో కలిసి పాత రామగుండం థర్మల్ స్టేషన్ స్థానంలో నిర్మించే కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జాయింట్‌వెంచర్‌లో చేపడుతున్నట్లు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యా క్షన్ కమిటీ నాయకులు స్పష్టం చేశా రు.

రామగుండం థర్మల్ స్టేషన్‌ను సింగరేణి, జెన్‌కో జాయింట్ వెంచర్‌గా నిర్మించాలని ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం విద్యుత్ సౌధాలో ధర్నా చేప ట్టారు. అపార అనుభవం ఉన్న జెన్‌కో ద్వారానే నిర్మించాలని, ప్రభు త్వ రంగ సంస్థను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మ న్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్, సదానందం, ఈశ్వర్ పాల్గొన్నారు.