calender_icon.png 27 December, 2024 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు!

27-12-2024 01:57:02 AM

  1. జనవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల 
  2. కసరత్తు చేపట్టిన తెలంగాణ ఉన్నత విద్యామండలి

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): మే నెలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్ చివరి ఈ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉన్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను జనవరి మొదటి వారంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది.

వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్‌సెల్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, పీఈసెట్, ఈసెట్, లాసెట్ ప్రవేశ పరీక్షలన్నీ మేలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి.. షెడ్యూల్ విడుదలపై కసరత్తు చేస్తోంది. జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. ఏ పరీక్షలు అడ్డంకి కాకుండా సెట్స్ తేదీలను అధికారులు ఖరారు చేస్తున్నారు.