జేఈఈ రెండు సార్లే రాసేలా కుదింపు
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్ణయాన్ని జాయింట్ అడ్మిషన్స్‌బోర్డు(జాబ్) యూటర్న్ తీసు కుంది. రెండు వారాల క్రితం మూడుసార్లు రాసే అవకాశానిచ్చిన బోర్డు తాజాగా రెండుసార్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 15న నిర్వహించిన సమావేశంలో మూడు నుంచి రెండుసార్లకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఐఐటీ కాన్పూర్ సోమవారం వెల్లడించింది.
అడ్వాన్స్‌డ్ పరీక్ష విషయంలో పాత విధానమే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దేశంలోని ఐఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2013 నుంచి అమలుచేస్తున్న పాత నిబంధనలే అమల్లో ఉంటాయని ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది.