దుదియా తండా నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా 100 కుటుంబాలు చేరికలు..
కోదాడ (విజయక్రాంతి): సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలు, నాయకులు చేరుతున్నారని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. చిలుకూరు మండలం దుదియా తండా గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన 100 కుటుంబాలు ఆదివారం దుదియా తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుగులోతు రవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు. పట్టణ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ చెరికలకు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని సాధరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు లావూరి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ గుగులోతు నాగేశ్వరరావు, భూక్య సక్రం, గుగులోతు నాగేశ్వరరావు గుగులోతు రాములు భానోత్ బాలు బోడలింగాతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు బాదావత్ శ్రీనివాస్, ఉపేందర్, రామ్ సింగ్, నరేందర్, శివ, బాలు, మోతిలాల్, వీరభద్రం తదితరులు ఉన్నారు.