calender_icon.png 2 February, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు..

02-02-2025 04:03:19 PM

రామాయంపేట (విజయక్రాంతి): మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేలు గౌడ్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ లో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో రామాయంపేట, నిజాంపేట మండలం చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో రామాయంపేట మాజీ జడ్పీటీసీ, మాజీ ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి తో పాటు, మాజీ కౌన్సిలర్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజులు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది.

ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఫిబ్రవరి రెండవ వారంలో పార్టీ రామాయంపేటలో భారీ సభ ఏర్పాటుచేసి రామాయంపేట, నిజాంపేట్ మండలం, రామాయంపేట మున్సిపల్ లోని పలువురు నాయకులు,కార్యకర్తల చేరికలు కాంగ్రెస్ పార్టీ లో కి ఉంటాయని తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రావు, అధిష్టానం పెద్దలు, మరియు రామాయంపేట సీనియర్ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.