మంథని, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని దొంతులవాడ, ఉస్మాన్ పురకు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ౫౦ మంది మైనార్టీ నాయకులు, కార్యకర్తలు జాఫర్ పాషా ఆధ్వర్యంలో ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కప్పి కాంగ్రెస్లోకి మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, పట్టణ అధ్యక్షుడు పోలు శివ, బీసీ సెల్ డివిజన్ అధ్యక్షుడు గోటికారి కిషన్ జీ, నాయకులు బండారి ప్రసాద్, కాళ్ళ రవి, బర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.