నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి సమక్షంలో మల్లారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గాజుల శంకర్, టీఆర్ఎస్ యూత్ నాయకులు గాజుల అబ్బా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ డిసీసీ మెంబర్ జవాజి రమేష్, నిజామాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పైసా ఎల్లయ్య, నిజామాబాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గాస్కంటి లక్ష్మణ్ తో పాటు మసూద్, శ్రావణ్ పాల్గొన్నారు.